Showing posts with label TE. Show all posts
Showing posts with label TE. Show all posts

Tuesday, April 23, 2019

యువరాజ్ సింగ్ క్యాన్సర్ రోగ నిర్ధారణ - జాతక విశ్లేషణ


కర్మ సంబంధిత రుగ్మతలకే కాకుండా శారీరక రుగ్మతలు యోక్క కారాణాలు కూడా మెడికల్ ఆస్ట్రోలజీ ద్వారా సుక్ష్మాతిసుక్ష్మంగా తెల్సుకొనవచ్చును. ఇది ముఖ్యంగా డాక్టర్లకు చాలా ఉపయోగం.

“To the medical man, astrology is invaluable in diagnosing diseases and prescribing a remedy, for it reveals the hidden cause of all ailments.”                                                                                                                —Max Heindel


యువరాజ్ సింగ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు అన్న సంగతి లోక విదితమే, ఇప్పుడు ఈ విషయాన్ని వారి జాతకములో పరిశీలించుందాం. క్యాన్సర్ కారక గ్రహాలు ముఖ్యంగా శని, రాహు మరియు చంద్రుడితో పాటుగా 1,6,8, మరియు 12 భావాల కలయిక.

Yuvi Astrological Chart
Yuvi at Hospital
యువరాజ్ సింగ్
జననం : 12 డిసెంబర్ 1981   సమయం : 21: 45( 9:45pm) చండీగడ్.
 

ఈ జాతకుడు కర్కాటక లగ్నంలో జన్మించగా, లగ్నాధిపతైన చంద్రుడు 12వ భావంలో స్థితి పొందినాడు. కె.పి (krishnamurthy paddaahti)  ప్రకారం లగ్నాధిపతి అయిన చంద్రుడు 11వ భావంలో ఉన్నా, ఆ చంద్రుడు రాహువు నక్షత్రంలో ఉండి.. అట్టి రాహువు 12వ భావంలో ఉన్న కారణంగా లగ్నాధిపతికి.., అంటే చంద్రుడికి 12వ భావ సంబంధం ఏర్పడింది. 

ఇంకనూ 12వ భావంలో ఉన్న ఛాయ గ్రహమైన రాహు 6వ భావాధిపతి అయిన గురువు యోక్క పునర్వసు నక్షత్రంలో స్థితి పొందిన కారణాంగా రాహువుకు 6వ భావం సంబంధం ఏర్పడగా, తత్ ఫలితంగా చంద్రుడికి కూడా  రాహవు ద్వారా 6 భావ సంబంధం ఏర్పడింది. 

ఈ కారణంగా చంద్రుడికి 1,6,12 భావల సంబంధం వచ్చింది, అయితే ఇక్కడ లగ్నం అంటే తను భాగం .. అనగా వ్యక్తిని లేక దేహాన్ని సూచిస్తే, 6వ భావం రోగాన్ని తెలియజేస్తే, 12వ హస్పిటలైజేషన్ గురించి చెప్తుంది. కర్కాటక లగ్నం, చర లగ్నం... దీనికి 11వ భావాధిపతి అయిన శుక్రుడు భాదకుడు అవుతాడు, అయితే ఈ శుక్రుడు కూడా 6వ భావంలో స్థితినొంది లగ్నాన్ని వీక్షించడం వల్ల కూడా ఒకటి మరియు ఆరవ భావల మధ్య సంబంధం కలిసినది. 

దీని కారణంగా ఈ విధమైన గ్రహ సంపత్తి వల్ల జాతకుడు రోగం పాలు అవుతాడు అని స్పష్టమౌతుంటే, దీన్నీ ఇంకా నిర్విర్యం చేస్తూ 8వ భావాధిపతి అయిన శని 3వ భావంలో స్థితిపొంది తన పదవ దృష్టితో చంద్రుడిని వీక్షిస్తున్నాడు.  ఆరోవ భావం రోగాన్నీ విశదీకరిస్తే, ఎనిమిదోవ భావం తీవ్రతను తెలియజేస్తుంది. మొత్తంగా ఇది తీవ్రమైన రోగము అనేది స్పష్టమగుచున్నది, అయితే ఎక్కడా? అనగా శరీరములోని ఏ భాగానికి, ఏ అవయానికి ఎలాంటి రోగమో తెలియాలంటే కాలపురుషుడిని పరిశీలించాలి.






రోగానికి సంబంధించిన భావాలతో సంబంధమున్న చంద్రుడు ఇక్కడ, మిధునం(Gemini)లో  స్థితిపొందినాడు. మిధునం వాయుతత్వ రాశి అవ్వడమే కాకుండా కాలపురుషునికి 3వ భావం, ఈ మూడవ భావం శ్వాస సంబంధితమని తెలియజేస్తుంది. ఇది కాక మిధునం ద్విస్వభావ రాశి అయిన కారణంగా ఇంకా దాని అధిపతి కూడా ద్విస్వభావ గ్రహం కూడా కావటంచేత, రాశి..గ్రహం రెండు,మానవశరీరంలోని ఒకటి కంటే ఎక్కవ ఉండు అవయవాలనే సూచిస్తాయి... ఊదాహరణగా, కన్నులు, కిడ్నిలు, ఊపిరితిత్తులులాంటివి.  పై విషయాలను ప్రకారం ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధిగా అవగతం అవుచ్చున్నది, అయితే ఏ వ్యాధి అనగా ఇక్కడ 1,6,8 మరియు 12 వ భావాలతో పాటుగా చంద్రుడు రాహువు శనితో సంబంధం ఉన్న కారణం చేత ఇది క్యాన్సర్ గా నిర్ధారించబడుచున్నది. ఎందుకనగా రాహువు మ్యలిగ్నెన్సీ, ఎక్సపాన్షన్, మల్టీపుల్ గ్రోత్ సూచించగా, శని అవయం పాడవటాన్నీ తెలియజేస్తుంది.
జాతకంలో ఉన్నా సరే ఏది జరగాలన్నా అది యోగం అయినా లేక రోగం అయినా.., అందుకు DBA’S అంటే అప్పుడు, ఆ క్షణానికి నడుస్తున్న దశా, భుక్తి మరియు అంతరములు సహకరించాల్సిందే. యువరాజ్ సింగ్ కు వరల్డ్ గెలిపించిన అనంతరం 2011-2012 మధ్యలో క్యాన్సర్ నిర్ధారణ జరిగింది. అప్పుడు నడుస్తున్నవి శని/శుక్ర/చంద్ర... అంటే శని దశలో శుక్రుడి భుక్తిలో చంద్రుడి అంతరము. భుక్తినాధుడు శుక్రుడు భాధకాధిపతి అయ్యి ఆరవ భావం నుంచి లగ్నాన్నీ వీక్షిస్తుండగా, ఇంకా చంద్రుడికి 1,6,8,మరియు 12వ భావాల సంబంధం రాహువు ద్వారా సంక్రమించగా, ఇక దశానాధుడైన శని అష్టమభావాధిపతి అయ్యి 3వ భావంలో స్థితిపొంది 12వ భావంలో చంద్రుడి వీక్షించటం ద్వారా ఈ మూడింటికి రోగ సంబంధిత భావాల కనెక్షన్ ఫలితంగా ఆ సమయంలో యువరాజ్ సింగ్ క్యాన్సర్ కు గురి కావటం జరిగంది.

ఆరవ భావం రోగం అయితే దానికి వ్యయ భావం అయిన 5వ భావం కోలుకోవటాన్ని సూచిస్తుంది.  యువరాజ్ సింగ్ కు ప్రస్తుతం నడుస్తున్నది శని దశ. ఈ శని 7,8వ భావాలకు అధిపతిగా ఉండి 3వ భావంలో చిత్త నక్షత్రంలో స్థితిపొందటం చేత శని 2,3,5,10,7,8 భావలకు సంబంధం పొంది ఉన్నాడు. ఈ ఐదవ భావానికి కూడా దశానాధుడైన శనికి సిగ్నిఫికేషన్ రావటం చేత వ్యాధి నయమౌతుంది అని చెప్పవచ్చు. అయితే శని మందగమనుడు కాబట్టి కొద్దిగా మెల్లగా క్యూర్ అవుతుంది. ఇంకోక విషయం అసలే శని ఆయుష్షు కారకుడు, అదీకాక ఇక్కడ శని అష్టమాధిపత్యం అనగా అయుర్ భావంలో సంబంధం ఏర్పడి మారకాలైన 2,7 భావాలతో సంబంధం పెట్టుకన్నా, భాధకాధిపతితో సంబంధం ఏమి లేని కారణంగా శని దశ ముగిసేవరకు, అంటే నవంబర్ 2022 వరకు ఆయుష్షుకు వచ్చిన ప్రమాదమేమి లేదు అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఆ తర్వత వచ్చే బుధ ధశ 17 సంవత్సరములు, (upto 2039) ఆ బుధుడు కూడా మారక భాధకాలకు లింక్ లేక పోవటం చేత ఆ ధశలో కూడా ప్రమాదం ఏమి లేనట్టే. అయితే ఆరవ భావాధిపతి గురువు తన 9వ దృష్టితో లగ్నాధిపతైన చంద్రుడని చూస్తుండటం మరియు తత్ ఫలాన్ని(1,6) ఛాయ గ్రహమైన రాహువు కూడా ప్రతిబింబించటంతో, ఈ చంద్ర..రాహువు భుక్తులు లేక అంతరాలలో ఎప్పుడు వచ్చినా వ్యాధి మళ్ళీ పోడసూపే అవకాశం ఉంది. వరుసగా వచ్చే దశనాధులైన శని, బుధులు ఇద్దరు 5వ భావంకు కనెక్ట్ కావటం వల్ల క్యూర్ అవటం అంటూ ఉన్నా తగు జాగ్రత్త వహించడం మంచిది.

                                సర్వేజనా సుఖినోభవంతు.



గమనిక : యువరాజ్ సింగ్ క్రికెటర్ ఎలా అయ్యాడు అన్నది celebrities లో మళ్ళీ పోస్ట్ చేయడం జరుగుతుంది.

                                                       

Monday, April 15, 2019

శ్రీరామచంద్రుని దివ్య జాతకం

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
             సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే
శ్రీరాము పట్టాభిషేకం

రామ నామాన్ని మించిన మంత్రం లేదు, అందుకనే నిరంతరం రామ నామంలో రమించే ఆంజనేయుడు, ఆరాధ్యుడైనాడు. రామ కావ్యానికి పూనుకున్న బోయవాడు వాల్మీకి మహర్షి అయ్యాడు. రామ నామమే రక్షణ కవచంలా కాచి తలరాతను మారుస్తుంటే, మరి ఆ శ్రీరామచంద్రమార్తికి ఎందుకు ఇన్ని కష్టాలు? వనవాసం ఎందుకు ? సితా వియోగం ఎందుకు? కొరకరాని కొయ్యలాంటి ఈ ప్రశ్నలకు సమాధాన తాపత్రయమే ఈ పోస్ట్.

ఆ శ్రీరామచంద్రుడి జననాన్ని, జాతకాన్ని వాల్మికి మహర్షి.. రామయణంలోని, బాలకాండలో శ్లోక రూపంలో ఈ విధంగా వివరించారు...
           
     శ్లో II తతో యజ్ఞే సమప్తే తు ఋతూనాం షట్ సమాత్యాయు: II
            తతశ్చ ద్వాదశే మాసే, చైత్రే,నావమికే తిథౌ II
        
నక్షత్రే2దితి దైవత్యే, స్వోచ్చ సంస్థేషు పంచషు II
గ్రహేషు, కర్కటే లగ్నే వాక్పతా ఇందునా సహా II

ప్రోద్యమానే జగన్నాదమ్, సర్వలోక నమస్కృతమ్ II
కౌసల్య జనయద్రామమ్, సర్వలక్షణ సంయుతమ్ II

విష్ణోరర్ధమ్ మహాభాగమ్ పుత్రమైక్ష్వాకు నందనమ్ II
లోహితాక్షమ్ మహాబాహుమ్ రక్తోష్టమ్ దుందుభి స్వనమ్ II

అర్థము : యజ్ఞం సమాప్తి అయ్యిన తదుపరి ఆరు ఋతువులు గడిచాయి. అప్పుడు పన్నెండో మాసమున చైత్ర నవమి తిధి రోజున పునర్వసు నక్షత్రమున, అయిదు గ్రహములు తమతమ ఉచ్చ స్థానములలో ఉండగా, కర్కాటక లగ్నమున, వాక్ అధిపతి చంద్రునితో బృహస్పతి కలిసి ఉండగా, జగత్తులకునాధుడు, సర్వలోకములచే నమస్కరింపబడువాడును, సర్వశుభ లక్షణ సంయుతుడును, విష్ణువు యొక్క అవతారమైనవాడును, ఇక్ష్వాకు కులమునకు ఆనందకరుడును , ఎర్రని కన్నులు.. పెదవులు కలవాడును కలవాడును, గొప్ప బాహువులు కలవాడును, మంచి కంఠధ్వని కలవాడు అగు శ్రీరామునకు కౌసల్యదేవి జన్మనిచ్చినదని వాల్మీకి ఉవాచ.

చిన్న శ్లోకములో వాల్మీకి మహర్షి మహత్తరమైన జ్యోతిష వివరాలలనే గాక సాముద్రిక వివరాలను కూడా వివరిస్తూ శ్రీరాముని దివ్యమైన వ్యక్తిత్వాన్ని మనకు చూపిస్తున్నాడు.

పై విషయాలను గణన చేయగా రాముని భ చక్రం ఈ విధంగా రూపోందింది.

     9
   శుక్రుడు
    10
     రవి
 
    11
 బుధుడు
   12
   కేతు
    8
శ్రీరామచంద్రుని దివ్య జాతకం
  1 లగ్నం
చంద్ర
గురువు
    7
  కుజుడు
      2
    6
   రాహు
   5
     4
   శని
      3

ఇక ఇప్పుడు  ఈ చక్రాన్ని విశ్లేషిస్తే,  

శ్రీరామచంద్రుని ధర్మనిరతి :-

v ఆ పరంధాముడిది కర్కాటక లగ్నం, మరియు పునర్వసు నక్షత్రంలో స్థితి పోందిన చంద్రుడు కూడా ఉన్నది  లగ్నంలోనే...  లగ్నంలోనే చంద్రుని స్థితి జాతకుడి యొక్క ఎదురులేనటువంటి గుణాన్ని విశదీకరిస్తుంది. చంద్రుడు మన: కారకుడు, ఈ చంద్రునికి గురువుతో యుతి కారణంగానే రామచంద్ర ప్రభువు సహృదయాడు, దయాళువు, ఇంకా శరణాగతవత్సలుడు లాంటి గుణాలను పునికిపుచ్చుకున్నాడు.

v లగ్నంలో గురువు, ఈ గురువు సత్ సాంప్రాదాయాన్నీ, దైవ భక్తిని, ధర్మ నిభద్ధతని తెలియజేస్తుంది. నాడీ జ్యోతిష్య పరంగా గురువు, జీవ కారకుడు. ఈ జీవ కారకుడిని తన విశేషమైన 10వ దృష్టితో, కర్మ కారకుడైన శని చూస్తున్నాడు... ఈ రెండిటి సంయోగమే ధర్మకర్మాది యోగం... అనగా జాతకుడు ధర్మ సంబంధిత కర్మనే ఆచరిస్తాడు. రామో విగ్రవాన్ ధర్మ రాముడు ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం అన్న విషయం, ఈ గ్రహ స్థితి ఆధారంగా ప్రస్పుటమగుచున్నది.

శ్రీరాముని పరాక్రమము :-

v యాగ పరిరక్షణా నిమిత్తమై విశ్వామిత్ర  మహర్షితో వనానికి ఏగిన శ్రీ రామచంద్రమూర్తి పదమూడవ యేటనే తన ప్రతిభాపాటవాలను పరిచయం చేసాడు, పరాక్రమానికి ప్రతీక అయిన కుజుడి యొక్క చూపు లగ్నం మీద ఉండటం కారణంగానే జాతకుడు మంచి ధనుర్దారి, ధైర్యశాలి అన్న విషయాలు గోచరిస్తున్నాయి.

v ఆరవ భావం శతృ భావం, ఈ భావధిపతి ఉఛ్ఛస్థితిని పొందటం చేత శతృ అతి బలవంతుడు అని, ఇంక ఈ భావాధిపతి గురువు కూడా అగుటచేత అతను సకల విద్యాపరంగతుడైన బ్రహ్మణుడుగా అవగతం అవుతున్నది.(రావణ సంహరం తర్వాత శ్రీరాముడు బ్రహ్మహత్య పాతాక నివారణకై పూజలు కూడా చేసినట్టు ఐతిహం).

v ఇంక ఎదుటి వారిని లేక ప్రత్యర్థులను సప్తమభావం నుండి కూడా పరిగణించవచ్చును, అలా చూసిన సప్తమ భావాధిపతి అయిన శని కూడా తులలో ఉచ్ఛ స్థితిని పొందగా, సప్తమంలో స్థితి నోందినది పరాక్రమానికి ప్రతీక ఐన కుజుడు. ఇంకా కుజుడిది కూడా ఉఛ్ఛస్థితే. ఇలా ఏ విధంగా చూసినను రామభద్రుడు ఎదుర్కోన్న వాళ్ళు సామాన్యులు కారన్న విషయం తేటతెల్లమవుచున్నది. మరి అంతటి వారిని మట్టి కరిపించిన రామచంద్రమూర్తి నిస్సందేహంగా పరాక్రమవంతడేనని జాతక రీత్యా తెలుస్తున్నది.

శ్రీరాముని వైవాహిక జీవితం, సీతా వియోగ కారణాలు :-

v సప్తమ భావం, కళత్ర స్థానం. జాతకుడి వివాహ విషయాలను విశదీకరిస్తుంది. ఇది భూతత్త్వ రాశి అవడమే కాకుండా కుజుడు కూడా అక్కడే స్థితి పొంది ఉండటం, ఆ మహసాద్వి సితమ్మ తల్లి...  భూజనిత అన్న సార్థక నామధేయాన్ని... సారూప్యాన్ని బలపరుస్తున్నాయి.

v లగ్నం లో స్థితి పొందిన గురువు షష్ఠమాధిపతి, ఈ ఒకటి, ఆరవ భావాల మధ్య రిలేషన్ జాతకుడి విజయాన్ని సూచిస్తుంది. ఈ గురువు,... వీక్షణ,కళత్ర సంబంధమైన సప్తమ భావంపై, అందులో స్థితి పొందిన కుజుడి మీద ఉంది. అయితే ఈ కుజుడు పోరాటపటిమలకు, పోటి తత్త్వానికి మరియు అస్త్రశస్త్రాలకు సహజ కారకుడు, కాగా తత్ కుజుడి పై గురువు వీక్షణ ఫలితంగా ఏర్పడిన 1,6,7 భావాల సంబంధ కారణంగా.., శ్రీరాముడు  {1(లగ్నం),6(విజయం),7(కళత్రం)} సీతా స్వయంవరంలో పాల్గోని, శివుని విల్లును ఎత్తి గెలుపొందటాన్ని ఉద్ఘాటిస్తున్నాయి.

v లగ్నం లో స్థితి పొందిన గురువు షష్ఠమాధిపతి, లగ్న(ఒకటి) షష్ఠమ కలయిక సక్సెస్ ని అపాదించినా, వివాహ స్థానానికి ఈ గురువు వ్యయాధిపతి అవటంతో పాటు... ఇంక గురువు పైన సప్తమాధిపతి అయిన శని చూపు కారణంగా(ఆరవ భావం మరియు శని combination, separation సూచిక) సీతా వియోగాన్ని సూచిస్తున్నాయి.

v శుక్రుడు సహజ కళత్ర కారకుడు. ఈ శుక్రుడి పై గురు దృష్టి ఉండటం చేత సదాచారిణి, గుణవతి, శీలవతి అయిన సహధర్మచారిని తెలియజేస్తున్నాయి. ఐతే శుక్రడు, ఈ కర్కాటక లగ్న జాతకుడికి బాధకుడు కావడంచేత వివాహనంతర ఇబ్బందులు కూడా, ఈ జాతకం వల్ల అవగతం అవుతున్నాయి. 

శ్రీరాముని సోదరులు :-

v మూడవ భావం భాతృ భావం. కాగా ఈ భావాధిపతి అయిన బుధుడు, లగ్న వ్యయాధిపతి కూడా అయ్యి ఎకాదశ భావంలో స్థితి పొందినాడు, ఎకాదశం లాభస్తానమే అయ్యినా, ఈ లగ్నానికి బాధకస్థానం కూడా కాబట్టి భాతృ కారణంగా ఇబ్బందులు.

v భాతృ భావం ఫలితాలు ఈ రకంగా ఉంటే, భాతృ కారక గ్రహం అయిన కుజుడు సప్తమంలో స్థితి పొంది లగ్నాన్ని వీక్షించడం సోదరులకు రాముడి పైన కలిగిన విశేష ప్రేమాభిమానాలను తెలియజేస్తున్నది. ఇంకను ఈ కుజుడి దృష్టి లగ్నంలోని గురువు మీద , దశమ భావంలోని రవి మీద ఉన్న కారణంగా సోదరుడు, భరతుడు...  శ్రీరాముల వారి పాదుకల సాక్షిగా రాజ్య భారాన్ని మోసాడు.(రవి... రాజ్యానికి, రాజ్యపాలనుకు కారకడు. గురువు, ధనుర్మీనాలకు అధిపతి. మీనరాశి సహజ రాశి చక్రంలో 12వ రాశి. మేషరాశి కాలపురుషుని తలను సూచించగా, మీనం పాదాలను సూచిస్తుంది.)

శ్రీరాము పట్టాభిషేకం, రామరాజ్యం :-

v రవి... రాజు, రాజ్యాన్ని, రాజ్యఠీవిని, administration, ప్రభుత్వంలాంటి గ్రహ కారకత్వాలను సూచిస్తుంది, ఈ దశమభావంని రాజ్యభావం అని కూడా సంబోధిస్తారు, కారణం ఇది కర్మని అంటే వృత్తిని, బాధ్యతలని, పాలనాశక్తిని సూచిస్తాయి. దశమభావనికి రవి తోడవటం, ఆ రవి మీద శని చూపు వల్ల శ్రీరాముడు ప్రజారంజకమైన రాజుగా నేటికి కొనియాడబడుతున్నాడు . రవి రాజరికానికి కారకము ఐతే, శని డెమోక్రసీ...ప్రజాస్వామ్యనికి కారకుడు. ఈ రెండిటి సంయోగ ఫలితమే రామరాజ్యం.

v శని చూపు వల్ల ప్రజాస్వామ్యబద్ధ పాలన సాగినా, స్వతహాగా శని delay కారకడు, ఇంకా ఈ శని తన విశేషమైన 10వ దృష్టితో లగ్నంలోని చంద్రుడిని చూస్తున్నాడు. శని, చంద్రుల కలయికను పునర్ఫుగా అభివర్ణిస్తారు. పునర్ఫు అనగా పున రపి అనగా రెండవ ప్రయత్నంలో సిద్ధిస్తుందని అర్థం. ఈ పునర్ఫు వల్లనే  శ్రీరమచంద్రమూర్తి పట్టాభిషేకానికి(మొదటిసారి) అవాంతరం ఎర్పడి రావణ సంహారం అనంతరం పట్టాబిషక్తుడైనాడు.

శ్రీరాముని తండ్రి, ధశరథుని వివరాలు :-

v లగ్నంలో నవమభావధిపతి ఐన గురువు స్థితి, మరియు గురువు దృష్టి కూడా నవమభావం మీద ఉండటం జాతకుడికి (శ్రీరాముడికి) తండ్రికి మధ్య అవాజ్యమైన ప్రేమను తెలియజేస్తుంది.( నవమం తండ్రి స్థానం). ఐతే గురువు షష్టాధిపతి కూడా అయ్యి, ఇంక గురువు పైన శని చూపు కారణంగా(ఆరవ భావం మరియు శని combination, separation సూచిక) రాములవారకి తండ్రితో ఎడబాటు సంభవించినది.

v ఈ నవమం (మీనం) ద్విస్వభావ రాశి (dual House, ఒక్కటి కంటే ఎక్కువ) కావటం చేత, మరియు అక్కడే కళత్ర కారకడైన శుక్రుడి స్థితి పొందటం వలన తండ్రికి ఒక్కరి కంటే (ముగ్గురు... కౌసల్య, సుమిత్ర, కైకేయి) ఎక్కువ మంది భార్యలు అని తేటతెల్లమౌతున్నది.

v రెండవ భావం కుటుంబాన్ని తెలియజేస్తుంది. తండ్రి లగ్నాత్తు(నవమ లగ్నాతు) పరిశీలిస్తే ఇది మేషం అయ్యింది. ఇక్కడ సహజ పంచమాధిపతి (సంతానం) అయిన రవి స్థితి పొందగా, దాని మీద శని దృష్టి  ఆలస్యాన్ని సూచిస్తుంది. ఈ గ్రహస్థితి ఆధారంగానే ధశరథ మహరాజుకు సంతానం ఆలస్యంగా కలిగినది.

v మేషం అగ్ని తత్త్వరాశి, ఇంక అక్కడే స్థితి పొందిన రవి కూడా అగ్ని తత్త్వ కారకుడే (రవి... సహజ పంచమం, సంతానంతో పాటుగా ఆధ్యాత్మికతను, మంత్రశక్తిని సూచిస్తుంది) ఈ రవి మీద తండ్రి లగ్నాతు లాభ స్థానంలో స్థితి పొందిన కుజుడి చూపు (కుజుడు కూడా అగ్నినే సూచిస్తాడు) కారణంగా దశరథుడికి పుత్రకామేష్ఠి యాగం అనంతరం సంతానం కల్గింది.

విదేశియానం :-

v రాములవారిది కర్కాటక లగ్నం మరియు కర్కాటక రాశి. ఈ కర్కాటకం చర లగ్నం.  కాగా ఇందులో స్థితి పోందిన చంద్రుడు కూడా సంచారమునే సూచిస్తుండటము, మరియు లగ్నంలోనే ఉన్న నవమాధిపతి ఐన గురువు, దూర ప్రయాణలను సూచిస్తుండటము కారణంగా... ఇంక ఈ కర్కాటకం మరియు మీన రాశులు జలతత్త్వ రాశుల ఐన కారణంగా శ్రీరాముడు జలయానం చేసి, అనగా సముద్రాన్ని దాటి పరదేశనికి ఎగినట్టుగా గ్రహ స్థితి ఆధరంగా ప్రస్పుటమగుచున్నది.

కోదండరామ యాక్సిస్ :-

v రాముల వారి జాతకంలోని రాహు, కేతువుల స్థితిని కోదండరామ యాక్సిస్ గా నవీన జ్యోతిష్కులు అభివర్ణిస్తారు. రాములవారికి జీవితంలో దూరమైన రాజ్యం, సీతాదేవి, సంతానం తిరిగి లభించిన కారణంగా, ఇలా ఎవరికేని గ్రహసంపత్తి (రాహు, కేతువులు) ఉన్నా, వారికి కూడా దూరమైనవి లేక పోగొట్టుకున్నవి తిరిగి లభిస్తాయని నమ్మకం.   
     ఆ జగదభిరాముడు మనందరకూ ధర్మాచరణకు కావలసిన సంకల్ప బలాన్ని ఇచ్చుగాక !         
శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ